Wednesday, September 22, 2010

నూతనంగా ప్రవేశ పెట్టబడిన 6వ తరగతి పుస్తకం తప్పుల తడక

నూతనంగా ప్రవేశ పెట్టబడిన 6వ తరగతి పుస్తకం తప్పుల తడక 

 ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు 2010 విద్యా సం. నుండి  6వ తరగతికి పట్యపుస్తకములనుపుస్తకములను మార్చి కొత్త పుస్తకములను ప్రవేసపెట్టినారు. చాలా సంతోషించదగ్గ విషయం. ఈ క్రమములోనే ౬వ తరగతికి సామాన్యసస్త్రం పుస్తకమును కొత్తగా  ప్రవేసపెట్టినాను. ఇదికూడా రంగులలో అత్చువేయబడినది. ఇది  విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు మరియు గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకు అందరికి చాల ఆనదదాయకం.
కాని ఈ పుస్తకంలో వచ్చిన తప్పులను మీ దృష్టికి తీసుకొనివస్తున్నాను అవిఏమనగా వాటిలో ఒక్కొక్కటిగా ఈ దిగువున పెర్కొనుచున్నాను.
1  పాత్యపుస్తకం పేజి సంక్య 2 లో విజ్ఞానశాస్త్రం-పరిస్రమికాభివుర్ది గూర్చి వివరిస్తూ ఉన్న విషయం గూర్చి చెబుతూ ప్రక్కనున్న పటంలో పరిశ్రమలను చూపుతూ పటం క్రింద పరిశ్రమలు అని వ్రాసి పటం మీద " వంతెనలు " అని ఉన్నది. పటములు సరిగానే ఉన్నవి కాని వాటి పేర్లును గమనిచాలేకపోయారు.

2 . పట్యపుస్తకంలో 2వ unit లోని 2 .2 పాటం జీవుల వర్గీకరణ మొక్కలు, జంతువులు. ఈ పతంలోని వివరణ విద్యార్దుల స్టాయ్ కి మిన్చిఉన్నది. ఈ వయ్యస్సులోని విద్యార్దులు వర్గీకరణకు చెందినా వివరణను చూచి చదివి సామాన్యసస్త్రం ఆనగానే ఒక భయం వారిలో మానసికంగా కలిగేవిదంగా ఉన్నది మొక్కలు జంతువుల వర్గీకరణ అంత వివరంగా ఈ స్టాయ్ వారికీ అవసరంలేదు. మరియు ఈ వర్గీకరణ గూర్చి పే.జి విద్యర్దులే గుర్తుంచుకొనుట కష్టం. మరి వీరికి ఇంక కష్టంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంత విద్యార్దులకు మరింత కష్టం.
3 .  పాత్యపుస్తాకంలో పేజి  నెంబర్ 11 లో జంతువుల వర్గీకరణలో ఉదాహరణలు చెబుతూ నేమటిహేల్మిన్తిస్ నాకు బద్దిపురుగును ఉదాహరణగా చెప్పినారు. ఇది తప్పు దీనికి ఏలికపాము అని సరిచేయాలి. దీనికి సంభదించి పట్యపుస్తకంలోని ఆ పేజిని ఇక్కడ ఉంచుతున్నాను.
4 . పాత్యపుస్తకం పేజి నెంబరు 12 మరియు 13 లలో అకశేరుకాలు, ఉన్నత సకశేరుకాలు సంబందించి వివరణ ఇవ్వడం జరిగినది.  వీటిలో ప్రతి వర్గము గూర్చి వివరించడం జరిగినది. కాని ఈ వివరణ ఈ స్టాయ్ విద్యార్దులకు చాలా భారంగా  ఉంటుంది. వీటి వివరణలో ఉపయోగించియా వాటికీ ఉదాహరణలు: టెన్ టకిల్ల్స్ , దివ్స్తారిత జీవులు, త్రిస్తరిత జీవులు, అదేవిదంగా బాహ్య అస్తిపంజరం , ఉష్త్నరక్తం , విభాజక పటలం గూర్చి ఎంత చెప్పినాను విద్యార్దులకు భోదపడదు ఏవి చాలా క్లిష్టతతో కూడినవి . ఈ క్లిష్టత ను తగ్గించి సరళంగా విద్యార్దులు గ్రహిమ్చేవిదంగా రూపొందించిన బాగుండును.

5 . పాత్యపుస్తాకంలో 2 .5 మానవ సరిరంలోని అవయవ వ్యవస్తలులో 2 .5 .1 జీర్ణ వ్యవస్థ గూర్చి వివరణ చెబుతూ నోరు , గ్రసని , ఆహారవాహిక , చిన్నపేగు, పెద్దపేగు మరియు పురిశానాలం  మరియు పాయువు అనే సైడుహేద్దిన్గ్స్ తో వివరించుట జరిగింది. ఈ భాగంలో జీర్ణాశయం గూర్చి వివరణ అన్థయూ ఆహార వాహికలో  అన్నట్టు వివరించుట జరిగింది. ఇది తప్పు ఇక్కడ తప్పనిసరిగా  జీర్ణాశయం అని సబ్ హెడ్డింగ్స్ తో వివరించవలెను. మరియు చిన్నపేగుల గూర్చి చెబుతూ ఎక్కడా ఆహరం సోశించుకున్నట్లు వివరణ లేదు. ఇక్కడ్డ శోషణ జరుగునని తప్పని సరిగా వివరించాలి. వాచకం లో ఏవిదంగా ఉన్నది ఇక్కడ చూపుతున్నాను 

6 . వాచకం  రంగులలో ముద్రించినారు సంతోషకరము కానీ పేజి నంబరు 25 లో  పటం 2 .9 రక్తప్రసరణ వ్యవస్థ పటంలో ఈ పటంను విద్యార్దులు చూడగానే  ధమనులు సిరలు వేరు వేరుగా గుర్తిమ్చేవిధంగా ఉండాలి కానీ ఇక్కడ ధమనులుకు ఎరుపు రంగు గాని సిరాలకు నీలం రంగుగని ఉపయోగించలేదు. ఈ పటం కుడా క్లియర్గా లేదు సైన్సు లో రంగులు చాలా ముక్యం. కనీ పలితం సున్నా ఆ పాటని ఇక్కడ ఉంచుతున్నాను



7 .పాత్యపుస్తాకంలో  పేజి నెంబరు 28 లో  2 .5 .5 విసర్జక వ్యవస్థ దీనికి సంబందించి పటములో ప్రోస్త్రాటే గ్రంధి తప్పుగా గుర్తించటం జరిగింది. ఈ ప్రోస్త్రాట్ గ్రంధి మూత్రపిన్దాల పైన ఉండదు. ఇది The Prostate gland sits just below the bladder and in front of the rectum, partially surrounding the urethra which carries urine from the bladder out of the body. Forming part of the male reproductive system, the prostrate is responsible for the production of a clear liquid which makes up about one third of the seminal fluid used to carry and protect the male sperm during intercourse. ఐన  ఈ గ్రంది గూర్చి  చెప్పడం ఇక్కడ అవసరం లేదు. పట్యపుస్తకంలో ఇది ఏవిదముగా ఉన్నది అన్నది ఇక్కడ ఉంచుతున్నాను 

దీని యొక్క కరెక్ట్ లొకేషన్ మీకు ఈ చిత్రం ద్వార చుపించదలచినాను.
8 .  సైన్సు లో రంగులు ఉపయోగించి వేసిన పటముల వలన విద్యార్దులకు ఈ శాస్త్రం పట్ల ఎక్కువ అభిరుచి పెంచుకొని మరియు ఈ శాస్త్రం చదవాలని కోరిక ఎక్కువ అవుతుంది  కాని కనుక ఈ సైన్సు బొమ్మలకు  రంగులు అధిక ప్రాధాన్యత కలిగిఉన్నది. కాని పాత్యపుస్తాకంలో పేజి నెంబరు 32 లో  వేసిన పటములు యౌగ్లిన  మరియు పారమిచియం లు ఇక్కడ ఊగ్లిన  కాషాయ రంగు, పారమిచియం  నాకు ఆకుపచ్చ ర్నగు వేయడం జరిగింది. ఇది తప్పు ఉగ్లినలో క్లోరోప్లస్తులు ఉందును కావున ఇది ఆకుపచ్చగా  ఉంటుంది కావున దీనికి ఆకుపచ్చ రంగు ఉపయోగించవలెను పారమిచియం కు కాదు. మరియు ఇక్కడ ఉగ్లిన పటమునకు  పారమిశియంఅని పేరు పెట్టారు  పారమిశియం నకు ఉగ్లిన అని పేరుపెట్టడం ఎంతవరకు సమంజసం. ఇది నూటికి నూరు శాతం తప్పు  పాత్యపుస్తాకంలో వేసిన పాటలను ఇక్కడ ఉంచుతున్నాను
9 . పాత్యపుస్తకం పేజి నెంబరు 70 లో 5 .1 .5 అయస్కాంతాల మద్య ఆకర్షణ మరియు వికర్షణలు వీటి గూర్చి చెబుతూ మొదటి లైన్ లో ఈ విధముగా ఉన్నది అది  " రెండు అయస్కాంతాల మద్య ఆకర్షణ ( దూరంగా నేట్టబడటం) అని ఉన్నది. ఇక్కడ ఆకర్షణ అనగా దూరంగా నేట్టబడటం అని వస్తున్నది. ఆ పేపర్ క్లిప్ ఇక్కడ ఉంచుతున్నాను.
10 . పాత్యపుస్తాకంలో 7 .3 ఉష్టన ప్రసారం  అనే పాతం లో ఉష్టన ప్రవాహం గూర్చి చెబుతూ చూపిన పటములో వ్యక్తి పట్టుకున్న చాకుకి  అధమ ఉష్టన వాహకమైన ప్లాస్టిక్ పిడి కలిగిఉన్నది చాకును పట్టుకొని మంటలో ఉంచినట్లు చూపించినారు ఈ పటము సరిఐనది కాదు ఏ విదమైన బంధనము లేని లోహపు కడ్డిని పట్టుకోనినట్లు చూపిన్చవలెను. పుస్తకంలో ఉన్న పేజిని ఇక్కడ ఉంచుతున్నాను 

11 . పాత్యపుస్తాకంలో 7 .3 ఉష్టన ప్రసారం అనే పాతంలో పేజి నెంబరు 111 నందు ఉత్తమ ఉస్త్న వాహకములను ఉదాహరనులుగా రాగి, అలుమినియం , ఇనుము మొదలైనవి అని చిప్పినారు.కాని ఉత్తమ ఉష్టన వాహకమైన వెండిని చెప్పలేదు. 

12 . పాత్యపుస్తాకంలోని 9 .1 ఆరోగ్యము సంరక్షణ అనే పాతంలో పేజి నెంబరు 135 లో నీరు గూర్చి చెబుతూ ' నీరు శరీరంలో పదార్దాలను రావానాంకు  ఉపయోగపడుతుంది.' అని చెప్పడం జరిగింది. ఇది తప్పు శరీరంలోని పదార్దాల రవాణాకు రక్తం ఉపయోగపడుతుంది. ఈ విషయంను గమనించండి.

13 . పాత్యపుస్తాకంలోని ౯.౩ భద్రత రక్షణ - ప్రదమ  చికిస్థ అనే పాతంలో పేజి నెంబరు 145 లో నీటిలో మునుగుత - ప్రదమ చికిసత్చ గూర్చి వివరణ ఇస్తూ నీటిలో మునిగిన వ్యక్తిని కర్ర , తాడు వ్యక్తి సహాయంతో నీతిపైకి వచెట్లు చేయాలి  వ్యక్తిని బోర్ల పడుకోబెట్టి వీపు పైన రెండు చేతులతో అదమాలి. వ్యక్తి సరిరం ఏటవాలుగా ఉంచి రొమ్ము ప్రాంతంలో పైకి, కిందికి అదమాలి అని ఉన్నది. కాని పటంలో మాత్రం వ్యక్తిని బోర్ల పడుకోబెత్తకుండా వెల్లకిలా పడుకోబెట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న విదముగా  ఉన్నది. పటమునకు వివరణకు ఏ విదమైన సంబందము లేదు. ఆ పటమును ఇక్కడ ఉంచుతున్నాను
14 . ఈ పాత్యపుస్తాకంలో కొత్తగా చేర్చిన అంశం ' ఏ కొత్త పదాలు నేర్చుకున్నాం ? " చాలా baagunnadi.


No comments: