జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , కట్టమూరు, పెద్దాపురం మండలం, లో చదువుచున్న 6వ తరగతి విద్యార్థి చిరంజీవి పి. వినయ్ కుమార్ స్వయంగా వ్రాసినపద్యాలు.
(1)
జ్ఙానమిచ్చు గురువులమీద చాడీలు చెప్పకు
అక్కడ మాటలు ఇక్కడ చెప్ప నీచులారా
గురువు శిక్షించుట మన మంచికేరా !
సత్యమిది తెలుసుకో ! వినయకుమారా !
(2)
అవసరానికి మించి ఆహరం తయారీ వృధారా !
ఆకలితో ఉన్నవారికి అందించారా!
ఆకలితో మరణించు ఎన్నో జీవులు
సత్యమిది తెలుసుకో ! వినయకుమారా !
(3)
భవిత పెరుగు నీటికరువు
నీరులేని యెడల పంటలు ఎట్లా పండు !
నీటి అనవసరంగా వాడకురా !
సత్యమిది తెలుసుకో ! వినయకుమారా !