Showing posts with label Scientists. Show all posts
Showing posts with label Scientists. Show all posts

Tuesday, August 6, 2024

About Alexander Fleming

 

మానవాళికి ప్రతిరోజూ ఉపయోగపడే పెన్సిలిన్ రూపకర్త "అలెగ్జాండర్ ఫ్లెమింగ్" గారి జయంతి నేడు...(ఆగస్టు,06)

 


అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్కాట్లాండ్‌కు చెందిన జీవశాస్త్రవేత్త. ఆగస్టు 6, 1881న జన్మించిన ఫ్లెమింగ్ తొలి యాంటి బయాటిక్ పెన్సిలిన్ రూపకర్తగా ప్రసిద్ధిచెందాడు. ఈ పరిశోధనకుగాను ఆయనకు 1945లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. లైసోజోమ్‌ ఎంజైమును కూడా కనుగొన్న అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మార్చి 11, 1955న మరణించాడు.

ఈయన స్కాట్లండ్‌కు చెందినవాడు. లండన్ లోని మేరీ మెడికల్ కాలేజీ నుంచి 1906 లో డిగ్రీ తీసుకొని అక్కడే కొంతకాలం పాటు బాక్టీరియా లను నిరోధించే పదార్థాలపై పరిశోధనలు చేశాడు. అక్కడ నుంచే ఆర్మీ మెడికల్ కార్ఫ్ కి వెళ్లి, మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా 1918 లో మళ్ళీ సెయింట్ మేరీ మెడికల్ కాలేజీకి వచ్చి వేశాడు. ఆంటీ బయాటిక్స్ మీద పరిశోధనలు మాత్రం విడువకుండా చేసేవాడు. ఫలితంగా 1928 లో పెన్సిలిన్ ను రూపొందించగలిగాడు. వెయ్యేళ్ల కాలంలోనే అతి గొప్ప ఆవిష్కరణగా, కోట్లాది మంది ప్రాణాలకు రక్షణగా గుర్తింపు పొందింది 'పెన్సిలిన్‌'. తొలి యాంటీ బయోటిక్‌గా పేరొందిన ఆ మందును కనిపెట్టిన శాస్త్రవేత్తే అలగ్జాండర్‌ ఫ్లెమింగ్‌. వేరే ప్రయోగం చేస్తుండగా జరిగిన చిన్న పొరపాటు వల్ల ఇది బయటపడడం విశేషం. పెన్సిలిన్‌ వల్ల క్షయ, న్యూమోనియా, టైఫాయిడ్‌ లాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మానవాళికి రక్షణ కలుగుతోంది. దీన్ని కనిపెట్టినందుకు ఫ్లెమింగ్‌ 1945లో నోబెల్‌ బహుమతిని పొందారు.

 

మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో సైనికులకు చికిత్సలు చేసే బృందానికి నాయకత్వం వహించాడు. గాయాలకు సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్‌ సోకి చాలా మంది సైనికులు చనిపోవడాన్ని గమనించిన ఫ్లెమింగ్‌ యుద్ధానంతరం బ్యాక్టీరియాపై పరిశోధనలు చేయసాగాడు. వాటిలో భాగంగా 'స్టెఫైలో కోకి' సూక్ష్మజీవులపై పరిశోధన చేస్తుండగా ఓ రోజున చిన్న పొరపాటు జరిగింది. ఆ బ్యాక్టీరియా ఉన్న పాత్రలను బల్లపై పెట్టి మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు వచ్చి చూస్తే బయటి వాతావరణం ప్రభావం వల్ల ఓ పాత్రలో నీలిరంగులో బూజులాంటి తెట్టు (ఫంగస్‌) కట్టి ఉండడం గమనించాడు. చిత్రంగా ఆ బూజు ఆశించినంత మేరా పాత్రలో సూక్ష్మజీవులు నాశనమై కనిపించాయి. అంటే ఆ బూజులో సూక్ష్మజీవులను చంపే పదార్థమేదో ఉందన్నమాట! దాంతో ఫ్లెమింగ్‌ దానిపై పరిశోధనలు చేసి చిన్న కుంచెలాగా ఉండే పదార్థాన్ని వేరుచేయగలిగాడు. లాటిన్‌లో పెన్సిలియమ్‌ అంటే చిన్న కుంచె అనే అర్థం ఉండడంతో దానికి 'పెన్సిలిన్‌' అని పేరు పెట్టాడు. దాన్ని 1928లో కనిపెట్టగా, మరిన్ని పరిశోధనలు చేసి ఓ మందుగా మార్చి వాడుకలోకి తీసుకు రావడానికి 17 సంవత్సరాలు పట్టింది. దీంతో యాంటీబయాటిక్‌ యుగానికి నాంది పలికినట్టయింది.

 

అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్కాటిష్ జీవశాస్త్రవేత్త మరియు వైద్య రసాయన శాస్త్రవేత్త (ఫార్మకాలగిస్ట్) . ఈయన కనిపెట్టిన "ఎంజైము లైసోజైము(1923 ) , అంటి బయోటిక్ ' పెన్సిలిన్(1928 ) ' ముఖ్యమైనవి . పెన్సిలిన్ ఆవిష్కరణకుగాను 1945లో నోబెల్ బహుమతి వచ్చింది .1945లో వైద్యశాస్త్రానికి ఫ్లెమింగ్ తో పాటు హొవార్డ్ ఫ్లోరె, ఎర్నెస్ట్ చెయిన్ శాస్త్రవేత్తలకు కూడా నోబెల్ లభించింది.