BASELINE TEST INSTRUCTIONS
ఫౌండేషన్ వారు సూచించిన టెస్టింగ్ టూల్స్ ఆధారంగా రూపొందించిన ప్రశ్నా పత్రాలతో అన్ని ప్రభుత్వ (GOVT' ZP, MUNICIPAL, APMS, KGBV, WELFARE SCHOOLS) మరియు ఎయిడెడ్ యాజమాన్యాలలోని పాఠశాలలలో తేది 22.07.22 న బేస్లైన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది.
బేస్లైన్ టెస్ట్ రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుచున్న విద్యార్థులకు నిర్వహించాలి.
ప్రశ్నా పత్రాలు సమగ్ర శిక్ష నుండి అందించబడతాయి.
పరీక్ష ముగిసిన తరువాత జవాబు పత్రాలను మరియు ఇతర మెటీరియల్ ను రాష్ట్ర కార్యాలయానికి పంపాలి.
ఒక్కొక్క ఉపాధ్యాయునికి నాలుగు పేజీల ఇన్స్ట్రుక్షన్స్ బుక్లెట్లు ఇవ్వబడతాయి.
మరో ఐదు పేజీల ఓరల్ టెస్టింగ్ టూల్స్ ప్రశ్నా పత్రం ఇవ్వబడతాయి
ప్రతి విద్యార్థికి పెన్ వినియోగించి వ్రాయ వలసిన నాలుగు పేజీల టెస్టింగ్ టూల్ ప్రశ్నా పత్రం ఇవ్వబడుతుంది.
ఇవి పది సెట్స్ లో ఇవ్వబడతాయి.
వీటిని విద్యార్థులకు ఇచ్చేటప్పుడు మొదటి విద్యార్దికి సెట్ 1, రెండవ విద్యార్థికి సెట్ 2, మూడవ విద్యార్థికి సెట్ 3, వరుస క్రమంలో ఇవ్వాలి.
మొదటి పదిమంది విద్యార్థులకు వరుసక్రమంలో పది సెట్లు ఇచ్చిన తరువాత పదకొండవ విద్యార్థి నుండి మరల సెట్ 1 నుండి ప్రారంభించి ఇవ్వాలి.
తెలుగు, ఇంగ్లీష్ , గణితంలలో బేస్లైన్ టెస్ట్ నిర్వహించాలి.
బేస్లైన్ టెస్ట్ రెండు రకాలుగా ఉంటుంది.
మొదటిది మౌఖిక పరీక్ష. రెండవది రాత పరీక్ష.
రెండు నుండి పదవ తరగతి వరకు ఒకే రకమైన ప్రశ్నా పత్రం ద్వారా మౌఖిక పరీక్ష జరపాలి.
మొదటి రోజు తెలుగు, రెండవ రోజు ఇంగ్లీష్ , మూడవ రోజు గణితంలో మౌఖిక పరీక్ష నిర్వహించాలి.
మౌఖిక పరీక్ష కొరకు ప్రతి పాఠశాలకు రెండు శాంపిల్స్ ఇవ్వబడతాయి.
ప్రతి శాంపిల్ నందు ఐదు స్థాయిలు ఉంటాయి.
అవి తెలుగు నందు :- ప్రారంభ స్థాయి, అక్షరాల స్థాయి, పదాల స్థాయి, పేరా స్థాయి, కథ స్థాయి.
గణితం నందు :- ప్రారంభ స్థాయి, ఒక అంకె సంఖ్యలు, రెండు అంకెల సంఖ్యలు, మూడు అంకెల సంఖ్యలు, గణిత ప్రక్రియలు
ఇంగ్లీష్ నందు :- ప్రారంభ స్థాయి, కాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, పదాలు, వాక్యాలు
విద్యార్థి చదవగలిగిన విధానాన్ని బట్టి ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో గుర్తించాలి.
ఒక్కొక్క విద్యార్థిని వ్యక్తిగతంగా పిలిచి, చదివించి వారి స్థాయిని నిర్ధారణ చేయాలి.
మౌఖిక పరీక్ష నిర్వహించగానే పిల్లల స్థాయిని రిజిస్టర్ నందు నమోదు చేయాలి. ఆన్లైన్ లో ఎంటర్ చేయాలి
మాలుగు, ఐదు స్థాయిలలో ఉన్న బాలలకు మాత్రమే రాత పరీక్ష నిర్వహించాలి.
రెండు నుండి ఐదు తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ లలో మాత్రమే రాత పరీక్ష ఉంటుంది.
గణితంలో మాత్రం మౌఖిక పరీక్షలో ఉన్న చతుర్విద ప్రక్రియలు చేయగలిగిన విద్యార్థులు రాత పరీక్ష రాసినట్లు పరిగణించాలి.
ఆరు నుండి పదవ తరగతుల విద్యార్థులకు తెలుగు, గణితం, ఇంగ్లీష్ లలో రాత పరీక్ష నిర్వహించాలి.
రాత పరీక్షలో మొత్తం నాలుగు స్థాయిలు ఉంటాయి.
అవి
1. అసలు ఏమీ రాయని / చేయని వారు
2. ప్రయత్నిచారు కానీ అన్నీ తప్పులే
3. రెండు మాత్రమే సరిగా రాశారు. 4. అన్నీ సరిగ్గా రాశారు.
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ పైన పేర్కొన్న అంశాలన్నింటినీ క్షుణ్ణంగా అవగాహన చేసుకుని విద్యార్థులకు ఇప్పటినుండే తగిన తర్ఫీదు ఇవ్వాలి.
తేదీ 22.07.22 న విద్యార్థులందరూ హాజరగుటకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు వారి పరిధి లోని అన్ని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ యాజమాన్యాల పాఠశాలల వారికి ఈ విషయాలు తెలియజేయడంతో పాటు, నిర్వహణ తీరును పర్యవేక్షించవలసిందిగా కోరడమైనది.*
TO DOWNLOAD INSTRUCTIONS CLICK HERE
No comments:
Post a Comment