ఆగస్ట్ 15, జనవరి 26 రెండు రోజుల్లోను జాతీయ జెండాను ఎగరేస్తారు.అయితే ఇక్కడ మనం గమనించని విషయం ఒకటుంది.ఆగస్టు 15న జెండాను స్తంభం మధ్యలో కడతారు. ఎగరేసినప్పుడు ఆ జెండాను స్తంభం మధ్య నుంచి పై అంచు వరకూ లాగి ఎగరేస్తారు. దీని అర్థం ఇంతవరకు ఒకరి కింద ఒదిగి ఉన్న మనం స్వేచ్ఛా జీవులై, గర్వంగా తల ఎత్తినామని.
అదే జనవరి 26 న జెండాను స్తంభం పై అంచులో కట్టి, దాని ముడి వీడి ఎగిరేలా చేస్తారు. ఆ రోజు already మనం స్వతంత్రులం కానీ మనకంటూ ఒక చట్టాన్ని తయారుచేసుకొన్న రోజు. ఇలా చేయాలని మన రాజ్యాంగంలో పెద్దలు నిర్దేశించారు.
(అంటే ఆగష్టు 15న మనం జెండాను పైకెత్తుతాం (hoist).
జనవరి 26 న మనం జెండాను ఎగురవేస్తాం(unfurled).
మరొకసారి చెబుతున్నాను
రాజ్యాంగం ప్రకారం ఆగస్టు 15న జెండాను pole మధ్యలో కట్టి, పైకి లాగి ఎగరేస్తారు.
జనవరి 26 న జెండాను pole పై భాగానే కట్టి, ముడి ఊడేలా లాగి ఎగరేస్తారు.
కానీ ఇప్పుడు ఎవరూ దీనిని అనుసరిస్తున్నట్లు లేదు.