Showing posts with label RATAN TATA. Show all posts
Showing posts with label RATAN TATA. Show all posts

Saturday, October 12, 2024

LIFE HISTORY OF RATAN TATA

 



టాటా ..ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉప్పు నుండి ఉక్కు వరకు … టీ నుండి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా(TATA) పేరు వినబడుతుంది. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో, సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగులతో మన దేశం లోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానం లో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీ ని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా(Ratan TATA).

దేశంలోనే అతి పెద్ద కంపెనీలు అయినటువంటి రిలయన్స్(Reliance), ఆదిత్య బిర్లా(Aditya Birla), అడాగ్ (ADAG) ఈ మూడు కలిపినా కూడా వీటన్నిటి కన్నా టాటా గ్రూప్ పెద్దది. కానీ అంత పెద్ద కంపెనీ అయినా కూడా ఏనాడూ అత్యంత ధనవంతుల జాబితాలో టాటా ఎందుకు లేరు? అలాగే సుమారుగా 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్ గురించి, దానిని నడిపించిన రతన్ టాటా గురించి తెలుసుకుందాం…!!

టాటా కంపెనీ మొదట ఒక టెక్సటైల్ మిల్ గా ప్రారంభమైయింది. జంషెట్జి టాటా(Jamsetji Tata) అనే ఆయన దీనిని స్థాపించారు. అలా 1868 లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశం లో మొట్టమొదటి సారిగా ఎయిర్ లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది టాటా లే. ఇప్పుడు ఎయిర్ ఇండియా గా చెప్పుకుంటున్న Airlines మొదట టాటా Airlines గా ఉండేది కానీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. తిరిగి 2022 లో ఎయిర్ ఇండియా ని టాటా గ్రూప్ చేజిక్కించుకుంది.

ఇదొక్కటే కాదు ఆసియా లోనే మొట్ట మొదటి స్టీల్ కంపెనీ , అలాగే మన దేశం లోనే మొట్ట మొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ (Taj Hotel) ని స్థాపించింది కూడా టాటా లే. ఇలా మన దేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేసారు. దేశ నిర్మాణంమరియు అభివృద్ధి లో టాటా ల పాత్ర ఎంత గానో ఉంది. వీళ్లందరిలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది రతన్ టాటా(Ratan TATA) గారి గురించి.

రతన్ టాటా గారు December 28, 1937 సంవత్సరం లో దేశం లోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడం తో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు. తరువాత అమెరికాలోని Cornell University లో ఇంజినీరింగ్ పూర్తి చేసారు. వెంటనే IBM company లో ఉద్యోగం వచ్చింది .. కానీ JRD టాటా, రతన్ టాటా ని ఇండియా కి వచ్చి టాటా స్టీల్ లో చేరమని సలహా ఇవ్వడం తో అమెరికా నుండి ఇండియా కి వచ్చి జంషెడ్ పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.

తరువాత 1991 లోJRD టాటా, రతన్ టాటా ని టాటా గ్రూప్ చైర్మన్ గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డు అఫ్ మెంబెర్స్ ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్ళందిరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా. ఈయన హయాం లో టాటా గ్రూప్ పరుగులు తీసింది. 10000 కోట్ల రూపాయలుగా ఉండవలసిన వ్యాపారాన్ని 23 లక్షల కోట్లకు చేర్చాడు రతన్ టాటా.