Teacher and service related information and Govt.orders,Review of Text Books.Teaching Learning Material (Digital) and you can also have all Examination Papers.
2022-23 విద్యా సంవత్సరంలో జరగబోయే 10 వ తరగతి కి సంబందించి పరీక్ష పేపర్ల మోడెల్ పేపర్లను మీకొరకు ఈ క్రింద డౌన్లోడ్ గా ఇస్తున్నాము. వీటిలో పరీక్ష పేపరు తయారుచేయుటకు ముందు బ్ల్యూ ప్రింట్ రాసుకోవటం జరుగుతుంది. దానికి సంబందించిన బ్ల్యూ ప్రింట్స్ ను కూడా మీకు అందిస్తున్నాము. మరియు ఈ బ్ల్యూ ప్రింట్ మరియు మోడెల్ పేపర్లను ఏవిధముగా అర్ధం చేసుకోవాలి. బ్ల్యూ ప్రింట్ ను ఉపయోగించి మనం ఎలా ప్లాన్ చేసుకొని చదవాలి అనే విషయాలను అన్ని మా " YOUR GURU" యూట్యూబ్ చానెల్ లో అందించటం జరిగినది. వీటిని అర్ధం చేసుకొనుటకు మా చానెల్ ను subscribe చేసుకోండి. ఈ వీడియొ ల యొక్క లింక్స్ కూడా ఇక్కడ ఇస్తున్నాము.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదోతరగతి పరీక్షల (SSC Exams) పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పేపర్ల సంఖ్యను తగ్గించింది.ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదోతరగతి పరీక్షల (SSC Exams) పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పేపర్ల సంఖ్యను తగ్గించింది. రాష్ట్రంలో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయనున్నందున 6పేపర్ల విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.ప్రస్తుతం అమలవుతున్న 2022-22 విద్యాసంవత్సరం నుంచే కొత్త విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇదిలా ఉంటే 2021-22 విద్యాసంవత్సరంలోనూ ప్రభుత్వం 6 పేపర్లతో పరీక్షలు నిర్వహించింది. తాజాగా పూర్తిస్థాయిలో నూతన పరీక్షా విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.గతంలో టెన్త్ పరీక్షలు 11పేపర్లతో నిర్వహించేవారు. హిందీ తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టులను రెండు పేపర్లుగా విభజించి పరీక్షలు నిర్వహించేవారు. కరోనా కారణంగా పాఠశాలలు సరిగా నడవకపోవడం, సిలబస్ తగ్గించడం వల్ల ప్రభుత్వం పేపర్లు కుదించింది. తాజాగా పూర్తిస్థాయిలో 6పేపర్లకే టెన్త్ పరీక్షలు నిర్వహించనుంది.