Monday, January 10, 2022

HOW TO APPLY ARMY PUBLIC SCHOOL TEACHERS RECRUITMENT 2022||ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ రిక్రూట్మెంట్ 2022

 

Army Public School Teachers Recruitment 2022

 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 8,700 పైగా టీచర్ పోస్టులు

నోటిఫికేషన్ వివరాలు

 ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8,700 పైగా పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ప్రైమరీ ట్రైన్డ్ టీచర్ (TGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అయితే ఏఏ స్కూళ్లల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయన్న విషయాన్ని వెల్లడించలేదు. ఎగ్జామ్ పూర్తైన తర్వాత స్కూళ్ల వారీగా వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదలవుతాయి. క్వాలిఫై అయిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది

ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8,700 పైగా పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2022 జనవరి 28 చివరి తేదీ. అభ్యర్థులకు 2022 ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం ఈ విధంగా ఉంటుంది 

భర్తీ చేసే పోస్టు

విద్యార్హతలు

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)

సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాస్ కావాలి.

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)

సంబంధిత సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్‌ కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాస్ కావాలి.

ప్రైమరీ ట్రైన్డ్ టీచర్ (PRT)

సంబంధిత సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాస్ కావాలి.

Important Time Lines

దరఖాస్తు ప్రారంభం- 2022 జనవరి 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జనవరి 28
పరీక్ష తేదీ- 2022 ఫిబ్రవరి 19, 20
ఫలితాల విడుదల- 2022 ఫిబ్రవరి 28
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- ఫ్రెషర్‌కు 40 ఏళ్ల లోపు, అనుభవజ్ఞులకు 57 ఏళ్ల లోపు.
ఎంపిక విధానం- ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ
ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

 రిజిస్ట్రేషన్ చేయడానికి ఇక్కడక్లిక్ చేయండి.

ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయడం మరియు అప్లై చేసే విధానం

Step 1- అభ్యర్థులు https://register.cbtexams.in/AWES/Registration వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- 
హోమ్ పేజీలో వివరాలన్నీ చదివిన తర్వాత Registration పైన క్లిక్ చేయాలి.
Step 3- PGT, TGT, PRT
పోస్టుల్లో అభ్యర్థులు తాము దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్టు సెలెక్ట్ చేయాలి.
Step 4- 
ఆ తర్వాత పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 5- 
ఆ తర్వాత లాగిన్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

ఆన్లైన్ లో అప్లై చేయడం మరియు పూర్తి వివరాల కొరకు ఈ వీడియొ ను చూడండి. 


 

No comments: