Saturday, January 8, 2022

ఇది పే రెవిజన్ కాదు పే రివర్స్ IT IS NOT A PAY REVISION, IT IS PAY REVERSE

 ఇది పే రెవిజన్ కాదు పే రివర్స్ 

IT IS NOT A PAY REVISION, IT IS PAY REVERSE 

ఐ.ఆర్ కన్నా తక్కువ ఫిట్మెంట్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలోనే లేదు. ఇది పే రివిజన్ కాదు పే రివర్స్ అని అందరూ అంటున్నారు ఇది ముమ్మాటికి వాస్తవం ఉద్యోగుల జీతాలు పెరిగాయి సాధారణ ప్రజలు అనుకుంటున్నారు అంటే వారికి దేనిపై సరైన విషయపరిజ్ఞానం లేదు అని అనుకోవచ్చు. దీనిపై అవగాహన కలిగించుటకు నేను చిన్న ప్రయత్నం చేయదలచుకున్నాను. ఉద్యోగులకు సంబందించిన జీత భత్యాలను పెరుగుతున్న ధరలను అనుసరించి వాటిమీద ఆద్యానం చేయుటకు ఒక కమిషన్ ను నియమిస్తారు ఇదే PRC కమిషన్ ఇది 5 సంవత్సరములకు ఒక పర్యాయము నియమిస్తారు. ఇది ఉన్న పరిస్తితులను అధ్యయనం చేసి ఒ నివేదిక ను ప్రభుత్వానికి సమార్పిస్తుంది. దీనిని అమలు చేసే వరకు ఉద్యోగులకు మద్యంతర భృతి ( IR) ఇస్తారు. నివేదికను అనుసరిచి ఉద్యోగులకు పే రివిషన్ చేసేటపుడు ఫిట్మెంట్ (FITMENT) అనేది ఇస్తారు. ఇది ఎప్పుడూ మద్యంతర భృతి ( IR) కన్నా 1% ఎక్కువ గానే ఉండాలి లేదా సమానంగానైనా ఉండాలి. పెరిగిన ధరలను బట్టి ఇచ్చిన మద్యంతర భృతి ( IR) పే రివిజన్ చేసేటప్పటికి ధరలుతగ్గిపోవు కదా ! ఇంకా పెరగుతాయి. ఇపుడు ఇచ్చిన ఫిట్మెంట్ 23.29% అంటే మద్యంతర భృతి ( IR) కన్నా తక్కువ  3.71% . ప్రకటించిన మద్యంతర భృతి ( IR) 27% అంటే ధరలు ఇంతగా తగ్గిపోయాయా?

ఇవి అన్నీ పక్కన పెట్టి ఈ పి. ఆర్. సి. ప్రకారం ఒక ఉద్యోగికి తాను తీసుకొనే జీతం ఎంత పేరుగుతుందో చూద్దాం. HRA పై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు కాబట్టి దానిని ప్రక్కన పెడదాం. 

ఇపుడు ఒక ఉద్యోగి మూల వేతనం రూ.40,000/- అనుకుంటే 

ప్రస్తుతం అతను తీసుకుంటున్నది 

మూలవేతనం                                             : 40,000/-

కరువు భత్యం (33.536%)                            : రూ.13414 

 మద్యంతర భృతి ( IR)(27%)                      :రూ.10,800      

మొత్తం:                                                     :రూ.64,214 

---------------------------------------------------------------------------------------------------------------------------

 పి. ఆర్. సి.తో సంబంధం లేకుండా బకాయిలు ఉన్న DA లు అన్నీ ఇస్తే ఈ ఉద్యోగి పొందే జీతం 

మూలవేతనం                                                రూ. 40,000/-

కరువు భత్యం (53.448 %)                            : రూ.2,1379 

 మద్యంతర భృతి ( IR)(27%)                         :రూ.10,800      

మొత్తం:                                                         :రూ.72,179 

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఇవ్వవలసి DA లు,  ఇచ్చిన 23%  ఫిట్మెంట్ ప్రకారం అతనికి వచ్చే జీతం 

 

మూలవేతనం                                                రూ. 40,000/-

కరువు భత్యం (53.448 %)                            : రూ.2,1379 

ఫిట్మెంట్   (23%)                                           :రూ.  9,200      

మొత్తం:                                                         :రూ.70,579 

ఇక్కడ కొందరు చెబుతున్నది ఈ ఉద్యోగి ప్రస్తుతం తీసుకుంటున్నది రూ.64,214/-లు PRC,DA లు ఇవ్వటం వలన ఈ ఉద్యోగి జీతం రూ.70,579/-లు అవుతుంది. అంటే అంతకు ముందుకంటే ఈ ఉద్యోగి జీతం (రూ.70,579 - 64,214 = 6,365 ) రూ.6,365/-లు పెరిగింది అని. 

కానీ వాస్తవంగా  PRC ఇవ్వకుండా ఈ ఉద్యోగికి ఇవ్వవలసిన DA లు  అన్నీ ఇస్తే ఇతను తీసుకొనే జీతం రూ.72,179/-. 

 PRC,DA లు ఇచ్చినా  ఇతనికి ఇచ్చే జీతం రూ.7,579/-లు ఈ ఉద్యోగికి PRC ఇవ్వటం వలన వచ్చిన నష్టం 72179 - 70579 = 1600. 

వాస్తవంగా ఆ ఉద్యోగికి రూ.1600/-లు నష్టం కానీ  కొందరి లెక్కల ప్రకారం ఆ ఉద్యోగికి జీతం రూ.6,365/-లు పెరిగింది అని. వాస్తవం మీరే ఆలోచించండి. 

 ఇంకా నిర్ణయం కానీ అంశాలు : 

HRA,CCA,TA ల  పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇంకా జరిగిన నష్టాలు : 

గత పి. ఆర్. సి. లో 11 నెలల కంటే నోషనల్ కాలాన్ని 21 నెలలకు పెరిగింది. 

నగదు ప్రయోజనం 18 నెలలకు పరిమితం.


 

No comments: