ఇది పే రెవిజన్ కాదు పే రివర్స్
IT IS NOT A PAY REVISION, IT IS PAY REVERSE
ఐ.ఆర్ కన్నా తక్కువ ఫిట్మెంట్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలోనే లేదు. ఇది పే రివిజన్ కాదు పే రివర్స్ అని అందరూ అంటున్నారు ఇది ముమ్మాటికి వాస్తవం ఉద్యోగుల జీతాలు పెరిగాయి సాధారణ ప్రజలు అనుకుంటున్నారు అంటే వారికి దేనిపై సరైన విషయపరిజ్ఞానం లేదు అని అనుకోవచ్చు. దీనిపై అవగాహన కలిగించుటకు నేను చిన్న ప్రయత్నం చేయదలచుకున్నాను. ఉద్యోగులకు సంబందించిన జీత భత్యాలను పెరుగుతున్న ధరలను అనుసరించి వాటిమీద ఆద్యానం చేయుటకు ఒక కమిషన్ ను నియమిస్తారు ఇదే PRC కమిషన్ ఇది 5 సంవత్సరములకు ఒక పర్యాయము నియమిస్తారు. ఇది ఉన్న పరిస్తితులను అధ్యయనం చేసి ఒ నివేదిక ను ప్రభుత్వానికి సమార్పిస్తుంది. దీనిని అమలు చేసే వరకు ఉద్యోగులకు మద్యంతర భృతి ( IR) ఇస్తారు. నివేదికను అనుసరిచి ఉద్యోగులకు పే రివిషన్ చేసేటపుడు ఫిట్మెంట్ (FITMENT) అనేది ఇస్తారు. ఇది ఎప్పుడూ మద్యంతర భృతి ( IR) కన్నా 1% ఎక్కువ గానే ఉండాలి లేదా సమానంగానైనా ఉండాలి. పెరిగిన ధరలను బట్టి ఇచ్చిన మద్యంతర భృతి ( IR) పే రివిజన్ చేసేటప్పటికి ధరలుతగ్గిపోవు కదా ! ఇంకా పెరగుతాయి. ఇపుడు ఇచ్చిన ఫిట్మెంట్ 23.29% అంటే మద్యంతర భృతి ( IR) కన్నా తక్కువ 3.71% . ప్రకటించిన మద్యంతర భృతి ( IR) 27% అంటే ధరలు ఇంతగా తగ్గిపోయాయా?