Thursday, May 15, 2025

SSC ASE TIME TABLE MAY 2025

 SSC (10th CLASS) ADVANCE SUPPLEMENTARY EXAMINATIONS TIME TABLE MAY 2025

10 వ తరగత అడ్వాన్స్డ్  సప్లిమెంటరీ 2025 పబ్లిక్ ఎక్సామ్ టైమ్ టేబుల్  కొరకు ఇక్కడ క్లిక్ చేయండి CLICK HERE 

Saturday, April 12, 2025

Friday, April 11, 2025

AP INTERMEDIATE 1ST & 2ND YEAR RESULTS -2025

 AP INTERMEDIATE 1ST & 2ND YEAR RESULTS -2025

ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎక్సామ్ రిసల్ట్స్ కొరకు క్రింది లింక్స్ క్లిక్ చేయండి 

లింకు-1 క్లిక్ హియర్ 

లింక్-2 క్లిక్ హియర్ 

Whatsapp message ద్వారా మీ రిసల్ట్స్ ను తెలుసుకోండి 

whatsapp నెంబర్ : 9552300009 

 అదనంగా, 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపడం ద్వారా Mana Mitra WhatsApp సేవ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులకు శుభాకాంక్షలు! మీ కష్టపడిన ప్రతిఫలం రేపటి ఫలితాలలో ప్రతిఫలించి, ప్రకాశవంతమైన భవిష్యత్తుకి ద్వారాలు తెరచాలని ఆకాంక్షిస్తున్నాం!

Tuesday, April 8, 2025

బంకించంద్రచటర్జీ వర్ధంతిఏప్రిల్ 8 || Bankim Chandra Chatterjee Death anniversary

 

జాతిఅస్తిత్వాన్ని నిలబెట్టిన వందేమాతరంగీతరచయిత& జాతీయవాది బంకించంద్రచటర్జీ వర్ధంతిఏప్రిల్ 8భారత స్వాతంత్ర్యోద్యమకాలంలో ప్రతిభారతీయునినోట వేదమంత్రమై నిలిచినది,నాడు ఆంగ్లేయులకు వణుకు పుట్టించినది, నాటి స్వాతంత్ర్య విప్లవవీరులకు కర్తవ్యాన్నిప్రబోధించి దేశభక్తికి ప్రతీకగానిలిచిన వందేమాతరం గీతాన్ని రచించిన బంకించంద్ర చటర్జీ వర్ధంతి-ఏప్రిల్ 8వ తారీకు.                       

*నవలారచనలో ఆరితేరి,"వంగదేశపుస్కాట్"గా అభివర్ణించబడిన బంకించంద్రుని 131వ వర్ధంతి(8.4.1894)సందర్భంగా.... 

Saturday, October 12, 2024

LIFE HISTORY OF RATAN TATA

 



టాటా ..ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉప్పు నుండి ఉక్కు వరకు … టీ నుండి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా(TATA) పేరు వినబడుతుంది. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో, సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగులతో మన దేశం లోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానం లో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీ ని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా(Ratan TATA).

దేశంలోనే అతి పెద్ద కంపెనీలు అయినటువంటి రిలయన్స్(Reliance), ఆదిత్య బిర్లా(Aditya Birla), అడాగ్ (ADAG) ఈ మూడు కలిపినా కూడా వీటన్నిటి కన్నా టాటా గ్రూప్ పెద్దది. కానీ అంత పెద్ద కంపెనీ అయినా కూడా ఏనాడూ అత్యంత ధనవంతుల జాబితాలో టాటా ఎందుకు లేరు? అలాగే సుమారుగా 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్ గురించి, దానిని నడిపించిన రతన్ టాటా గురించి తెలుసుకుందాం…!!

టాటా కంపెనీ మొదట ఒక టెక్సటైల్ మిల్ గా ప్రారంభమైయింది. జంషెట్జి టాటా(Jamsetji Tata) అనే ఆయన దీనిని స్థాపించారు. అలా 1868 లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశం లో మొట్టమొదటి సారిగా ఎయిర్ లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది టాటా లే. ఇప్పుడు ఎయిర్ ఇండియా గా చెప్పుకుంటున్న Airlines మొదట టాటా Airlines గా ఉండేది కానీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. తిరిగి 2022 లో ఎయిర్ ఇండియా ని టాటా గ్రూప్ చేజిక్కించుకుంది.

ఇదొక్కటే కాదు ఆసియా లోనే మొట్ట మొదటి స్టీల్ కంపెనీ , అలాగే మన దేశం లోనే మొట్ట మొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ (Taj Hotel) ని స్థాపించింది కూడా టాటా లే. ఇలా మన దేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేసారు. దేశ నిర్మాణంమరియు అభివృద్ధి లో టాటా ల పాత్ర ఎంత గానో ఉంది. వీళ్లందరిలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది రతన్ టాటా(Ratan TATA) గారి గురించి.

రతన్ టాటా గారు December 28, 1937 సంవత్సరం లో దేశం లోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడం తో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు. తరువాత అమెరికాలోని Cornell University లో ఇంజినీరింగ్ పూర్తి చేసారు. వెంటనే IBM company లో ఉద్యోగం వచ్చింది .. కానీ JRD టాటా, రతన్ టాటా ని ఇండియా కి వచ్చి టాటా స్టీల్ లో చేరమని సలహా ఇవ్వడం తో అమెరికా నుండి ఇండియా కి వచ్చి జంషెడ్ పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.

తరువాత 1991 లోJRD టాటా, రతన్ టాటా ని టాటా గ్రూప్ చైర్మన్ గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డు అఫ్ మెంబెర్స్ ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్ళందిరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా. ఈయన హయాం లో టాటా గ్రూప్ పరుగులు తీసింది. 10000 కోట్ల రూపాయలుగా ఉండవలసిన వ్యాపారాన్ని 23 లక్షల కోట్లకు చేర్చాడు రతన్ టాటా.