Wednesday, October 22, 2025

ఉద్యోగులకు కరువు భత్యం పెంపు G.O.MS.No. 60, Dated: 20-10-2025

ఉద్యోగులకు కరువు భత్యం పెంపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఈ అధికారిక ఉత్తర్వులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (DA) పెంపును మంజూరు చేస్తాయి. 2024 జనవరి 1 నుండి అమలులోకి వచ్చే విధంగా, DA ని 3.64% పెంచడం ద్వారా మొత్తం రేటును **33.67% నుండి 37.31%**కి సవరించారు. ఈ పెంపుదల గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, విశ్వవిద్యాలయాల సిబ్బందితో సహా వివిధ ఉద్యోగుల వర్గాలకు వర్తిస్తుంది. 2006 మరియు 2016 UGC పే స్కేల్స్‌లో ఉన్న ఉద్యోగులకు కూడా DA రేట్లు సవరించబడ్డాయి, మరియు 2025 అక్టోబర్ జీతంతో పాటు ఈ సవరించిన భత్యం నగదు రూపంలో చెల్లించబడుతుంది. అయితే, 2024 జనవరి నుండి 2025 సెప్టెంబర్ వరకు ఉన్న బకాయిలు ఉద్యోగులు పదవీ విరమణ చేసే సమయంలో చెల్లించబడతాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (Dearness Allowance - DA) పెంపు రేటు మరియు దాని అమలు సమయపాలన (implementation timeline) వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన G.O.MS.No. 60, Dated: 20-10-2025 ఆధారంగా ఈ విధంగా ఉన్నాయి:

కరువు భత్యం పెంపు రేటు (Enhancement Rate)

కరువు భత్యం పెంపుదల 01-01-2024 నుండి వర్తించే విధంగా మంజూరు చేయబడింది, దీని పెరుగుదల శాతం 3.64%. అయితే, ఉద్యోగులు పొందుతున్న వేతన స్కేల్‌ను బట్టి పెంపుదల రేట్లు ఈ విధంగా ఉన్నాయి:

  1. సవరించిన వేతన స్కేల్స్, 2022 (Revised Pay Scales, 2022) లో ఉన్న ఉద్యోగులకు:

    • డి.ఎ.ను బేసిక్ పే (Basic Pay)లో 33.67% నుండి 37.31% కి సవరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
    • ఈ పెంపుదల 01.01.2024 నుండి అమలులోకి వస్తుంది.
    • ఈ పెంపు **3.64%**గా ఉంది.
    • ఈ రేటు జడ్పీలు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎయిడెడ్ సంస్థలు, యూనివర్సిటీల బోధన మరియు బోధనేతర సిబ్బంది (RPS, 2022 స్కేల్‌లో జీతం తీసుకునేవారు)కి కూడా వర్తిస్తుంది.
  2. సవరించిన యుజిసి పే స్కేల్స్, 2006 (Revised UGC Pay Scales, 2006) లో ఉన్న ఉద్యోగులకు:

Monday, August 18, 2025

సెలవు.. ఇక సెలవు అంటున్న ఉత్తరాల ఎర్ర డబ్బా



 *2025, సెప్టెంబర్ 1 నుంచి లెటర్స్ రెడ్ బాక్స్ ఉండదన్న వార్త తెలిశాక కలిగిన దుఃఖం...*


*సెలవు.. ఇక సెలవు  అంటున్న  ఉత్తరాల ఎర్ర డబ్బా* 


*దశాబ్దాలుగా నిస్వార్థంగా నిశ్శబ్దంగా నిశ్చలంగా విశ్వసనీయంగా సేవలు అందించిన భావోద్వేగాల  నేస్తం ఇక కనిపించదు. మన ముత్తాతలు, తాతలు, నాన్నల కాలం నాటినుంచి మన ఇళ్లకు దగ్గరలోనో, వీధి చివర్ల లోనో,పోస్ట్ ఆఫీస్ దగ్గర అభిమానంతో ఎదురు చూసిన నెచ్చెలి.  ప్రేమలు ఆత్మీయత తో కూడిన వార్తలు మోసుకొస్తూ, తీసుకు వెళ్తూ సంధాన కర్తగా, సేవలు అందించిన స్నేహశీలి . ఆశల కబుర్లు మోసుకు వచ్చి మనస్సుల్లో  సంతోషాల  పంచిన మిత్రుడు నేను.. ఇక కనిపించను అంటే ఎలా ఉంటుందో ఊహించటం కష్టం . అది తెలియని , చెప్పలేని  బాధ.*


*ఒకటా, రెండా చెప్పటానికి.*

*సుదూర తీరాలలో ఉన్న బంధువులు, మిత్రులకు  మన ఇంటిల్లిపాది విషయాలను మోసుకు వెళ్ళింది.అలాగే తీసుకు వచ్చింది. శుభ వార్తలు, పెళ్లి శుభలేఖలు, పరీక్షా ఫలితాలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం వచ్చిందనే తియ్యని కబురు ఇలా ఎన్నో మోసిన సమ్మోహన పెట్టె ..ఎర్ర డబ్బా..కాదు కాదు..మన జీవనంకు లింకే.. కదా... ప్రేమికులకు హృదయ స్పందన... సరిహద్దు సైనికులకు తమ వారి నుంచి వచ్చే ఒక శ్వాస అయింది కదా. అప్పుడప్పుడు కన్నీటి వార్తలను కూడా దిగమింగి చేర్చింది. ఒక్కసారి చేతి ముని వేళ్ళతో తనలో జార విడిచిన తరువాత  , తిరుగు సమాధానం వచ్చే వరకు వేచి చూడని వారు ఉండరు కదా*


*బాబూ  వీధి మూలన ఉన్న డబ్బాలో ఈ ఉత్తరం కాస్త వేసి రామ్మా ..అల్లుడు దగ్గర నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా...అబ్బాయి ఏమన్నా ఉత్తరం రాశాడా..ఈ మాటలు పాత సినిమాల్లోనే వినిపిస్తాయి. కనిపిస్తాయి. అంతే కదా.*


*ఇక ఆకాశవాణి, దూరదర్శన్, దిన, వార పత్రికలు అన్నీ తమ శ్రోతలు, ప్రేక్షకులు, పాఠకులకు కూడా  జాబులు.. జవాబులు కార్యక్రమాలు,, శ్రోతల ఉత్తరాలు వంటి శీర్షికలుకు పేర్లు మార్చుకోక తప్పదు మరి*


*కాలం మారి కార్డు, ఇన్లాండ్ లెటర్ ,కవర్ అన్నీ మాయం. ఇవి లేకపోతే ఇక  అవి వేసే ఎర్ర డబ్బా అవసరం పోయింది. అంతే ఇప్పుడు ఈ  డబ్బా మాయం. మనము  మరచిపోవటం కష్టమే. ఎందుకంటే  ఇది మన హృదయ స్పందనగా ఉండేది కదా...లోహపు పెట్టే కానీ మనిషి తనం నింపుకున్నది. పైగా  అందరి  కష్టసుఖాలు, సంతోషాలు , అభిప్రాయాలు అత్యంత గోప్యంగా మోసిన పెట్టె . మామూలిది కాదు.. కవుల కలాల్లో , సినిమాల్లో , సాహిత్యంలో భాగమైంది కదా. ఇక అన్నీ పోస్ట్ చేయని ఉత్తరాలే..జీవన ప్రయాణంలో భాగమైన పెట్టే కదా...ఎలా మరచి పోగలం.. సాధ్యమా.. సెప్టెంబర్ ఒకటి నుంచి కంటికి కనిపించక పోవచ్చు కానీ మన తరం జీవించినంత కాలం మన హృదయాల్లో మాత్రం పధిలం కదా.*


*ఏ సృజన శీలి సృష్టించారో తెలియదు కానీ...చుక్క నీరు లోపలికి పోదు. గాలివాన కదపలేదు. కుంభవృష్టి  అయినా, జోరు వర్షం అయినా , ముసురు పట్టినా,  కొద్దిచెమ్మ కూడా తగల నివ్వదు. తల్లి సంకన చంటిపిల్లలు ను పెట్టుకుని   కాపాడినట్లు చూస్తుంది. గాలికి బెదరదు.ఎగరదు. దానిలో కార్డు, ఇన్లాండ్ లెటర్, కవర్  వేయటం ఒక సరదా. వాటిని తీస్తున్నప్పుడు చూడటం అదో సరదా.*

Thursday, May 15, 2025

SSC ASE TIME TABLE MAY 2025

 SSC (10th CLASS) ADVANCE SUPPLEMENTARY EXAMINATIONS TIME TABLE MAY 2025

10 వ తరగత అడ్వాన్స్డ్  సప్లిమెంటరీ 2025 పబ్లిక్ ఎక్సామ్ టైమ్ టేబుల్  కొరకు ఇక్కడ క్లిక్ చేయండి CLICK HERE 

Saturday, April 12, 2025

Friday, April 11, 2025

AP INTERMEDIATE 1ST & 2ND YEAR RESULTS -2025

 AP INTERMEDIATE 1ST & 2ND YEAR RESULTS -2025

ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎక్సామ్ రిసల్ట్స్ కొరకు క్రింది లింక్స్ క్లిక్ చేయండి 

లింకు-1 క్లిక్ హియర్ 

లింక్-2 క్లిక్ హియర్ 

Whatsapp message ద్వారా మీ రిసల్ట్స్ ను తెలుసుకోండి 

whatsapp నెంబర్ : 9552300009 

 అదనంగా, 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపడం ద్వారా Mana Mitra WhatsApp సేవ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులకు శుభాకాంక్షలు! మీ కష్టపడిన ప్రతిఫలం రేపటి ఫలితాలలో ప్రతిఫలించి, ప్రకాశవంతమైన భవిష్యత్తుకి ద్వారాలు తెరచాలని ఆకాంక్షిస్తున్నాం!

Tuesday, April 8, 2025

బంకించంద్రచటర్జీ వర్ధంతిఏప్రిల్ 8 || Bankim Chandra Chatterjee Death anniversary

 

జాతిఅస్తిత్వాన్ని నిలబెట్టిన వందేమాతరంగీతరచయిత& జాతీయవాది బంకించంద్రచటర్జీ వర్ధంతిఏప్రిల్ 8భారత స్వాతంత్ర్యోద్యమకాలంలో ప్రతిభారతీయునినోట వేదమంత్రమై నిలిచినది,నాడు ఆంగ్లేయులకు వణుకు పుట్టించినది, నాటి స్వాతంత్ర్య విప్లవవీరులకు కర్తవ్యాన్నిప్రబోధించి దేశభక్తికి ప్రతీకగానిలిచిన వందేమాతరం గీతాన్ని రచించిన బంకించంద్ర చటర్జీ వర్ధంతి-ఏప్రిల్ 8వ తారీకు.                       

*నవలారచనలో ఆరితేరి,"వంగదేశపుస్కాట్"గా అభివర్ణించబడిన బంకించంద్రుని 131వ వర్ధంతి(8.4.1894)సందర్భంగా.... 

Saturday, October 12, 2024

LIFE HISTORY OF RATAN TATA

 



టాటా ..ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉప్పు నుండి ఉక్కు వరకు … టీ నుండి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా(TATA) పేరు వినబడుతుంది. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో, సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగులతో మన దేశం లోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానం లో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీ ని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా(Ratan TATA).

దేశంలోనే అతి పెద్ద కంపెనీలు అయినటువంటి రిలయన్స్(Reliance), ఆదిత్య బిర్లా(Aditya Birla), అడాగ్ (ADAG) ఈ మూడు కలిపినా కూడా వీటన్నిటి కన్నా టాటా గ్రూప్ పెద్దది. కానీ అంత పెద్ద కంపెనీ అయినా కూడా ఏనాడూ అత్యంత ధనవంతుల జాబితాలో టాటా ఎందుకు లేరు? అలాగే సుమారుగా 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్ గురించి, దానిని నడిపించిన రతన్ టాటా గురించి తెలుసుకుందాం…!!

టాటా కంపెనీ మొదట ఒక టెక్సటైల్ మిల్ గా ప్రారంభమైయింది. జంషెట్జి టాటా(Jamsetji Tata) అనే ఆయన దీనిని స్థాపించారు. అలా 1868 లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశం లో మొట్టమొదటి సారిగా ఎయిర్ లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది టాటా లే. ఇప్పుడు ఎయిర్ ఇండియా గా చెప్పుకుంటున్న Airlines మొదట టాటా Airlines గా ఉండేది కానీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. తిరిగి 2022 లో ఎయిర్ ఇండియా ని టాటా గ్రూప్ చేజిక్కించుకుంది.

ఇదొక్కటే కాదు ఆసియా లోనే మొట్ట మొదటి స్టీల్ కంపెనీ , అలాగే మన దేశం లోనే మొట్ట మొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ (Taj Hotel) ని స్థాపించింది కూడా టాటా లే. ఇలా మన దేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేసారు. దేశ నిర్మాణంమరియు అభివృద్ధి లో టాటా ల పాత్ర ఎంత గానో ఉంది. వీళ్లందరిలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది రతన్ టాటా(Ratan TATA) గారి గురించి.

రతన్ టాటా గారు December 28, 1937 సంవత్సరం లో దేశం లోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడం తో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు. తరువాత అమెరికాలోని Cornell University లో ఇంజినీరింగ్ పూర్తి చేసారు. వెంటనే IBM company లో ఉద్యోగం వచ్చింది .. కానీ JRD టాటా, రతన్ టాటా ని ఇండియా కి వచ్చి టాటా స్టీల్ లో చేరమని సలహా ఇవ్వడం తో అమెరికా నుండి ఇండియా కి వచ్చి జంషెడ్ పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.

తరువాత 1991 లోJRD టాటా, రతన్ టాటా ని టాటా గ్రూప్ చైర్మన్ గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డు అఫ్ మెంబెర్స్ ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్ళందిరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా. ఈయన హయాం లో టాటా గ్రూప్ పరుగులు తీసింది. 10000 కోట్ల రూపాయలుగా ఉండవలసిన వ్యాపారాన్ని 23 లక్షల కోట్లకు చేర్చాడు రతన్ టాటా.

Saturday, September 28, 2024

మహిళల్లో హార్మోన్ల సమతుల్యత కోసం 9 యోగా భంగిమలు


హార్మోన్ల సమతుల్యత కోసం యోగా

హార్మోన్ల సమతుల్యతను ప్రోత్సహించడంలో యోగా ఒక శక్తివంతమైన సాధనం, ముఖ్యంగా పిసిఒఎస్ లేదా హార్మోన్ల అసమతుల్యత వంటి పరిస్థితులతో వ్యవహరించే మహిళలకు. కొన్ని యోగా భంగిమలు మరియు అభ్యాసాలు ఎండోక్రైన్ వ్యవస్థను సానుకూలంగా ప్రభావితం చేస్తాయి, ఇది హార్మోన్ల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. హార్మోన్ల నియంత్రణకు మరియు హార్మోన్ల అసమతుల్యతను తిప్పికొట్టడానికి సహాయపడే కొన్ని సాధారణ యోగా భంగిమలు ఇక్కడ ఉన్నాయి:

ఒత్తిడి తగ్గింపు

దీర్ఘకాలిక ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతకు దోహదం చేస్తుంది. యోగా, శ్వాస మరియు బుద్ధిపూర్వకతపై దృష్టి పెడుతుంది, శరీరం యొక్క విశ్రాంతి ప్రతిస్పందనను సక్రియం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. లోతైన విశ్రాంతిని ప్రోత్సహించడంలో పిల్లల భంగిమ మరియు సవాసన వంటి భంగిమలు ముఖ్యంగా ప్రభావవంతంగా ఉంటాయి.

థైరాయిడ్ ను బ్యాలెన్స్ చేయడం

థైరాయిడ్ సమస్యలు హార్మోన్ల అసమతుల్యతకు సాధారణ కారణాలు. భుజం స్టాండ్ (సర్వాంగసనం) మరియు వంతెన భంగిమ (సేతు బంధనాసనం) వంటి నిర్దిష్ట యోగా భంగిమలు థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపిస్తాయి, దాని నియంత్రణకు సహాయపడతాయి.

Saturday, August 31, 2024

Action Plan for Swachhata Pakhwada (1-15 September, 2024)

 


Ministry of Education

 Department of School Education & Literacy

Suggested Action Plan for Swachhata Pakhwada (1-15 September, 2024)

1.9.2024 (Sunday) note – Instead of Sunday conduct 31.08.2024 (Saturday)

Swachhata Shapath Day

·         Swachhata Shapath function may be organized wherein all students and teachers/ staff may participate. Children to speak about and take pledges for Swachhata.

·         Swachhata awareness message to be posted on the website of the Department/ Organisations/ Schools.

·         Electronic banners may be created and uploaded on the departmental/ state web portals to highlight the observance of the Swachhata Pakhwada. Publicity and awareness generation may be done through use of social media, as well as electronic and print media.

·         Upload the number of students who took Swachhata Shapath and the number of schools who participated on Google tracker and photos, videos and publicity material on Google Drive.

2.9.2024 & 3.9.2024 (Monday & Tuesday)

Swachhata Awareness Days

·         Holding meetings of SMCs/ SMDCs/ PTAs to highlight the importance of cleanliness & sanitation and the importance of Hand-washing, promote water conservation/ Rain Water Harvesting practices during the Parent-Teacher Meetings (PTMs), parents and teachers and to encourage and inspire them for hygiene and sanitation in school as well as home.

·         Teachers to inspect sanitary facilities in each and every corner of school/ institution to do a quick assessment and make a proposal/plan for the upkeep of the facilities.

·         Adaptation for WASH facilities (hand wash facility, daily cleaning and disinfection, toilet/ urinal use, water facility use, ventilation, waste management, O&M etc) may be discussed with the local representatives. This may include ensuring adequate, clean and separate toilets for girls and boys, supplies like - soap, hand wash and safe water, disinfectants, cleaning staff etc.

·         A status check/review can be done for the piped water supply connection in the school given Jal Jeevan mission.

·         A status check and augmentation plan concerning water harvesting systems in the school may be taken up because of the current Jal Shakti Abhiyan - Catch the Rain, 2024 campaign

·         Extensive cleaning/disinfection of toilets, MDM kitchen, classrooms, fans, doors, windows, and clearing bushes in the campus to be undertaken. The local community may be involved in these activities with the participation of SMCs/PTAs and local representatives.

·         Weeding out/recording of the old files, records as per procedure.

·         All kinds of waste material like broken furniture, unusable equipment, defunct vehicles etc. should be completely removed from the premises of schools/institutions.

·         Upload a number of schools that participated on Google Tracker and photos, videos and publicity material on Google Drive.

To download Plan click below link

English

Telugu